ఖాజీపేట: పాల ఆటో ఢీకొని బాలిక మృతి

ఖాజీపేట మండలంలోని మూలవారిపల్లె గ్రామానికి చెందిన రామ్మోహన్ కుమార్తె అంజలి (3) శుక్రవారం రాత్రి పాల ఆటో ఢీకొనడంతో ఘటన స్థలంలోనే మృతి చెందింది. పాప రోడ్డుపైకి వచ్చిన సమయంలో ఆటో ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని సీఐ మోహన్ తెలిపారు.

సంబంధిత పోస్ట్