మైదుకూరు మున్సిపాలిటీ, 23వ వార్డు పరిధిలోని గొల్లపల్లె గ్రామంలో శుక్రవారం రాత్రి పెద్ద సంఖ్యలో దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. పొలాల్లో పంటకు నీరు పెట్టుకునే సమయంలో స్టార్టర్ వద్ద కేబుల్ లను కట్ చేసి ఎత్తుకుపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులకు నష్టం కలిగించేలా దొంగతనానికి పాల్పడుతున్న దొంగల ముఠాను పట్టుకొని కఠినంగా శిక్షించాలని పోలీసులను అభ్యర్థిస్తున్నారు.