మైదుకూరు మండలం ఆదిరెడ్డిపల్లి సమీపంలో బుధవారం రాత్రి కల్వర్టును ద్విచక్ర వాహనం ఢీకొని ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం, వ్యాపారం నిమిత్తం ప్రొద్దుటూరు నుండి గిద్దలూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుంది. మృతి చెందిన వ్యక్తి సిద్దయ్యగా గుర్తించారు. గాయపడ్డ వ్యక్తి జమ్మయ్య ఇరువురు అన్నదమ్ములు. గాయపడ్డ వ్యక్తిని మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.