మైదుకూరు మండలం లెక్కలవారిపల్లె వద్ద ఆటోను ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో మహిళా కూలి మృతి చెందింది. శనివారం ఆటోలో కూలి పనులకు మహిళలు వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకున్నది. ఘటనలో నానుబాలపల్లికి చెందిన మహిళా కూలి సుబ్బమ్మ మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.