కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన పోరుమామిళ్ల మండల పరిధిలో చోటుచేసుకుంది. తోకలపల్లెకు చెందిన బత్తుల అనూష (23) తన భర్త మల్లికార్జున మధ్య సోమవారం గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో విషద్రావణం తాగింది. కుటుంబ సభ్యులు గుర్తించి వైద్యానికి కడప రిమ్స్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందిందని ఎస్సై కొండారెడ్డి తెలిపారు.