శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం నూతన మేనేజర్ గా ప్రసాద్ బాధ్యతలు స్వీకరణ

వైఎస్సార్‌ కడప జిల్లా, మైదుకూరులో బ్రహ్మంగారిమఠం మండలంలోని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ మఠాధిపతులు శ్రీ వీరధర్మజ వేంకటాద్రి స్వాముల వారి ఆదేశాల మేరకు, పిపిఎన్ ప్రసాద్ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం నూతన మేనేజర్ గా బాధ్యతలు బుధవారం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకుల సమక్షంలో వేదమంత్రాలతో ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది, గ్రామస్తులు, టిడిపి నాయకులు, స్నేహితులు, బంధువులు పిపిఎన్ ప్రసాద్‌ కు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్