కడపలో రోడ్డు ప్రమాదం

వైఎస్సార్‌ కడప జిల్లా మైదుకూరు పరిధిలోని ఖాజీపేట మండలంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. కడప-కర్నూల్ హైవేపై కొండపేట క్రాస్ వద్ద గుర్తుతెలియని వాహనం వేగంగా వచ్చి స్కూటర్‌ను ఢీకొనడంతో, స్కూటర్ ప్రయాణికుడు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నిందితుడిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕