టిచర్ జ్వానేస్ ను సన్మానించిన ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు

కాజీపేట మండలం బాలానగర్ గ్రామానికి చెందిన ఉపాధ్యాయులు ఈరి జ్వానేస్ ఎంఈఎఫ్ జాతీయ సంయుక్త కార్యదర్శిగా ఎన్నిక కావడంతో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు జయరాముడు, మరియన్న మాదిగలు సంతోషం వ్యక్తం చేస్తూ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వారికి ఇటువంటి ఉన్నత పదవులు రావడం సంతోషదాయకం అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు, ఎంఈఎఫ్, ఎంఆర్పిఎస్ ఎంఎస్సి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕