అన్నమయ్య జిల్లా శేషాచలం అడవుల్లో శనివారం స్మగ్లర్లు, కూలీలు పోలీసులపై ఎదురుదాడికి పాల్పడ్డారు. డంపింగ్ కేంద్రం నుంచి దుంగలు తరలిస్తున్న సమయంలో వారిని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. ఈ ఘటన సుండుపల్లి మండలం రాయవరం గ్రామం కావలపల్లి వద్ద జరిగింది. గోవిందన్ వద్ద నుంచి రూ.80 లక్షల విలువైన 26 దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు అదనపు ఎస్పీ వెంకటాద్రి తెలిపారు.