కేవీపల్లెలో బూత్ ఏజెంట్‌పై దాడి

కేవీపల్లె మండలం వగళ్ల గ్రామానికి చెందిన బూత్ ఏజెంట్ సురేశ్ ఆదివారం తనపై కొందరు దాడి చేశారని ఆరోపించారు. వ్యక్తిగత విషయాలపై జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీయడంతో తనపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారని తెలిపారు. చికిత్స అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సురేశ్ పోలీసులను కోరారు.

సంబంధిత పోస్ట్