పోలియో రహిత సమాజానికి ప్రతి తల్లిదండ్రుల సహకారం: వైద్యాధికారి

కె.వి.పల్లి మండలంలోని గ్యారంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ పోలియో టీకా కార్యక్రమం నిర్వహించారు. డి డి ఓ హరి నాయక్, ప్రధాన వైద్య అధికారి డాక్టర్ రమేష్ రెడ్డి, ఏఎన్‌ఎం శకుంతల, వైద్య సిబ్బంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి తల్లిదండ్రులు సహకరించాలని వైద్యాధికారి సూచించారు. పిల్లలకు టీకాలు వేయడంతో పాటు తల్లిదండ్రులకు పోలియో నివారణ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్