గుర్రంకొండ: ఆటో బోల్తా.. ఆరుగురికి తీవ్ర గాయాలు

పెద్దమండెం మండలం కలిచర్లకు చెందిన శ్రీకాంత్, సాంబ, దుర్గాప్రసాద్, రెడ్డిశేఖర్, శివ, లక్ష్మీదేవి ప్రయాణికుల ఆటోలో గుర్రంకొండ టమోటా మార్కెట్ కు గురువారం బయలుదేరారు. ఆటో మార్గమధ్యంలోని గుర్రంకొండ మండలం సంఘ సముద్రానికి రాగానే ఎదురుగా వస్తున్న వాహనానికి సైడ్ ఇవ్వబోయి అదుపుతప్పి బోల్తాపడి గాయపడ్డారు. వెంటనే వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్