గుర్రంకొండ: రెడ్డమ్మ దర్శనానికి వస్తుండగా రోడ్డు ప్రమాదం

ఆదివారం గుర్రంకొండ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన శశికళ అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. చంద్రశేఖర్-శశికళ దంపతులు తమ కుమార్తెతో కలిసి బైక్‌పై రెడ్డమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్తుండగా, పార్లపల్లి సమీపంలో స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ అదుపుతప్పి పడిపోయింది. గాయపడిన శశికళను మొదట జిల్లా ఆస్పత్రికి, ఆపై మెరుగైన వైద్యం కోసం కోలార్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్