గుర్రంకొండ: ఆలయాల్లో చోరీలకు పాల్పడిన ముగ్గురు అరెస్ట్

అన్నమయ్య జిల్లాలో పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడిన ముగ్గురు నిందితులను గుర్రంకొండ ఎస్ఐ బాలక్రిష్ణ సోమవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. వాల్మీకిపురం శివాలయంలో శఠగోపం, వెండి కిరిటాలు, రామాపురం ఆలయంలో హుండీ నగదు, ఎల్ఆర్ పల్లిలో రెండు ట్రాన్స్‌ఫార్మర్లలోని కాపర్ వైరును నిందితులు దొంగిలించినట్లు సీఐ రాఘవ రెడ్డి తెలిపారు. నిందితుల వద్ద నుంచి మొత్తం రూ. 78 వేల విలువ చేసే వస్తువులను స్వాధీనం చేసుకున్నామని సీఐ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్