​కే. వీ. పల్లి: బైక్ అదుపుతప్పి వ్యక్తికి గాయాలు

కే. వీ. పల్లి మండలంలోని నూతన కాలువ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గోరకణంపల్లికి చెందిన శివ (35) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి నుంచి తన స్వగ్రామానికి బుల్లెట్ బైక్‌పై వస్తుండగా, నూతన కాలువ వద్ద వాహనం అదుపుతప్పి కిందపడిపోవడంతో ఆయన ముఖానికి, శరీరంలోని పలు భాగాలకు గాయాలయ్యాయి. స్థానికులు, బంధువులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా ఆయనను పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్