కె. వి. పల్లి: గ్యారంపల్లి రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

గురువారం కె. వి. పల్లి మండలం గ్యారంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గ్యారంపల్లి నుంచి పీలేరుకు బైకుపై వెళ్తున్న ఎర్రయ్య (60)ను పీలేరు వైపు నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎర్రయ్య గాయపడగా, స్థానికులు అతన్ని పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు కూడా దెబ్బతింది. కేవీ పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్