కలకడ - గుర్రంకొండ రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొని గాయపడిన వ్యక్తి శనివారం సాయంత్రం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. అంకయ్య కూలి పనుల కోసం గుర్రంకొండ వద్దకు బైకుపై వెళ్తుండగా బాటవారిపల్లె సమీపంలో ఓ వాహనం ఢీకొంది. బాధితుని కుటుంబీకులు మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందినట్లు తెలిపారు.