కలికిరి: పోక్సో కేసులో నిందితుడు అరెస్టు

ఇటీవల 14 సంవత్సరాల మైనర్ బాలికపై హరి (63) అనే వ్యక్తి బలాత్కారం చేశాడు అనే ఫిర్యాదుతో కలికిరి పోలీస్ స్టేషన్ లో పోక్సో కేసు నమోదు చేశారు. మంగళవారం తట్టివారి పల్లి వద్ద ఉన్న నిందితుడిని సీఐ రెడ్డి శేఖర్ రెడ్డి తన సిబ్బందితో వెళ్లి పట్టుకొని అరెస్టు చేసి వాల్మీకి పురం కోర్టులో హాజరు పరిచారు. జడ్జి 14 రోజులు రిమాండ్ విధించారని సీఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్