కలికిరి జేఎన్టీయూ కళాశాలలో మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్న చింతా రాకేష్ శనివారం ఐదుగురు స్నేహితుల తో కలసి నర్రావాండ్లపల్లెలోని వ్యవసాయ బావి వద్దకు ఈతకు వెళ్లారు. మిగిలిన వారికి ఈత రాకపోవడంతో వారు గట్టుపైనే ఉండిపోగా రాకేష్ మాత్రం బావిలోకి డైవ్ చేశాడు. దీంతో బావి అడుగున ఉన్న పూడికలో చిక్కుకుపోయాడు. ఈ విద్యార్థులు కళాశాల సిబ్బందికి విషయం తెలియజేశారు. వారు వెంటనే పోలీస్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.