కలికిరి స్థానిక జేెఎన్టీయూ కళాశాల విద్యార్థి రాకేష్ అనే యువకుడు, కొంతమంది స్నేహితులతో కలిసి కళాశాల సమీపంలోని బావిలో ఈతకు వెళ్లాడు. ఈత కొడుతూ సమయంలో అతను గల్లంతయ్యాడు. స్నేహితులు, స్థానికులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టగా కొద్దిసేపటి తరువాత బావిలోనే అతని మృతదేహాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు.