కలకడ: ఆటో, బైక్ ఢీ.. యువకుడి పరిస్థితి విషమం

వాల్మీకిపురం బైపాస్ రోడ్డు నందు ఆటో ఢీ కొట్టడంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. శుక్రవారం ఆసుపత్రి అవుట్ పోస్ట్ పోలీసుల కథనం ప్రకారం, కలకడ మండలం ఎగువ కురప్పల్లికి చెందిన అజయ్ వాల్మీకిపురం వస్తుండగా బైపాస్ రోడ్డులో ఆటో వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడిని 108 వాహనంలో మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్