కలకడ మండలం ఎర్రయ్య గారి పల్లి కి చెందిన వెంకటరమణ (45), అతని భార్య శారద (40) ములకలచెరువులోని పాఠశాలలో ఇద్దరూ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఆదివారం కుమార్తె కీర్తి (17)తో కలిసి పుంగనూరు వైపు వెళుతుండగా సుగాలి మిట్టలో ఐషర్ లారీ ఢీకొని ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా శారద మృతి చెందింది.