ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం వెనుక నుండి ఢీకొట్టిన సంఘటనలో రైతు దుర్మరణం పాలైన సంఘటన ఆదివారం జరిగింది. పోలీసుల కధనం మేరకు. కలకడ బాటవారిపల్లి సమీపంలోని హంద్రీనీవా కాలవ వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని శ్రీనివాసులు అతని భార్య సుశీల తో కలిసి తమ ద్విచక్ర వాహనంలో ఈ క్రమంలో వారు రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుకు వైపు నుండి ఢీ కొట్టారు. ఈ సంఘటనలో శ్రీనివాసులు తలకు బలమైన గాయం అయ్యి అక్కడికక్కడే మృతి చెందాడు.