శ్రీ బాలాజీ సొసైటీ అధ్యక్షుడిగా పామల నారాయణ ఎన్నిక

పీలేరు నియోజకవర్గం కెవిపల్లి మండలం గ్యారంపల్లి గ్రామంలో శ్రీ బాలాజీ సొసైటీ ఎన్నికల ప్రక్రియ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో పామల నారాయణ సొసైటీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్ తో పాటు రవికుమార్, మంగిరి బాలకృష్ణ, వెంకటరమణ, రవీంద్ర, రామచంద్ర సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోలింగ్ ఆఫీసర్ డా. సాదిక్, స్పెషల్ ఆఫీసర్ డా. పి ప్రదీప్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు. నూతన అధ్యక్షుడికి సభ్యులు, పెంపకందారులు, గ్రామస్తులు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్