పీలేరు మండలం బోడుమల్లు వారిపల్లి సమీపంలోని చెరువులో ఈతకు వెళ్లి మారెళ్శ పడమటి పల్లెకు చెందిన ఎంపీయూపీ మండలం ఉపాధ్యాయుడు నంద కుమార్ దుర్మరణం చెందారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. ఉపాధ్యాయుడు మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.