పీలేరు: కారు అదుపుతప్పి బావిలో పడి ముగ్గురు మృతి

అన్నమయ్య జిల్లా పీలేరు సదుం రోడ్డులో కారు అదుపుతప్పి బావిలో పడడంతో కర్ణాటక కు చెందిన ముగ్గురు మృతి చెందారు. ఆదివారం ఉదయం వెలుగు చూసిన ఈ విషాదకర ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు మేరకు కారు అర్ధరాత్రి సమయంలో రోడ్డు పక్కన ఉన్న బావిలోకి దూసుకెళ్లి పడడంతో కారులో ఉన్న ముగ్గురు మృతి చెందారు. మృతులు ఎవరన్నది తెలియరాలేదు. కర్ణాటక రిజిస్ట్రేషన్ నెంబర్ తో కారు ఉందని పోలీసులు తెలిపారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్