పీలేరు: శాకంబరీ దేవిగా వాసవీ అమ్మవారు

ఆషాఢమాసం మూడో శుక్రవారం సందర్భంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారు శాకంబరీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు నాగేశ్వర స్వామి, మంజునాథ స్వామి శుక్రవారం అమ్మవారిని వివిధ కూరగాయలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు. శాకాంబరీ అలంకారంలో ఉన్న అమ్మవారిని ఆర్యవైశ్య సంఘ సభ్యులు, సామాన్య ప్రజలు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు తీరప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్