అన్నమయ్య జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా

అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం విఠలం వద్ద మంగళవారం ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. మదనపల్లె ఆర్టీసీ డిపోనకు చెందిన నాన్ స్టాప్ బస్సు తిరుపతికి వెళ్తుండగా టైరు పంక్చర్ కావడంతో పక్కనే ఉన్న కల్వర్టులోకి వెళ్లి బస్సు బోల్తా పడింది.
ఈ దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕