వాల్మీకిపురం సమీపంలో సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. నాగర్‌కోయిల్–ముంబై ఎక్స్‌ప్రెస్ రైలు వస్తుండగా ట్రాక్‌పై ఉన్న వ్యక్తిని గమనించిన లోకోపైలట్ అత్యవసర బ్రేకులు వేయడంతో అతడి ప్రాణాలు దక్కాయి. స్వల్ప గాయాలైన బాధితుడిని సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడు తన వివరాలు చెప్పకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.