దొంగతనానికి యత్నించిన వ్యక్తిని పట్టుకున్న గ్రామస్థులు

కలికిరి మండలంలోని దూదేకులపల్లి (కట్ట) ప్రాంతంలో బుధవారం ఒక వ్యక్తి దొంగతనం చేయడానికి ప్రయత్నించాడు. గ్రామస్థులు అనుమానాస్పదంగా తిరుగుతున్న అతన్ని గమనించి పట్టుకున్నారు. సోదా చేయగా, తాళాలు పగలగొట్టే పరికరాలు, దొంగిలించబడిన వస్తువులు లభించాయి. గతంలో స్థానిక చికెన్, కటింగ్ షాపులలో జరిగిన దొంగతనాలకు సంబంధించిన వస్తువులు కూడా దొరికినట్లు స్థానికులు తెలిపారు. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్