ప్రొద్దుటూరులో ఉప్పాగు కాలువను భూరాబందులు ఆక్రమిస్తున్నారు. సగంబ్రిడ్జి వరకు వేస్ట్ మట్టిని ట్రాక్టర్ల ద్వారా తరలించి వాగును పూడ్చేస్తున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ భూ రాబందుల వెనుక అధికార, ప్రతిపక్ష నాయకులు ఉన్నారని అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇదంతా ఒక రాజకీయ ముసుగులో ఒక వ్యక్తే చేస్తున్నట్లు సమాచారం.. వేచిచూడాలి మరి అధికారులు ఉప్పాగు ఆక్రమణకు అడ్డుకట్ట వేస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.