పెన్నా నదిలో సిల్ట్ డంపింగ్ ఆపాలని బీజేపీ నేతలు వినతి

ప్రొద్దుటూరులో పంచాయతీ, మున్సిపాలిటీ పరిధిలోని కాలువల్లోంచి తీసిన సిల్ట్, వ్యర్థాలను స్థానిక ధర్మల్ రోడ్డు వద్ద పెన్నా నదిలో డంప్ చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ డంపింగ్‌ను అడ్డుకున్న బీజేపీ నేతలు, స్థానిక ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఎమ్మెల్యేకు సోమవారం వినతిపత్రం ఇచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే అధికారులకు తెలియజేయడంతో, ఎంపీడీవో కార్యాలయంలో DLDOను కలిసిన బీజేపీ నాయకులకు, పెన్నా నదిలో వ్యర్థాలు వేయకుండా చూస్తామని DLDO హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్