ప్రొద్దుటూరులోని బొల్లవరం వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఉన్న నరాల బాలిరెడ్డి కాలనీలో నాలుగు ఇళ్లలో చోరీ జరిగింది. స్థానికుల వివరాల మేరకు బుధవారం అర్ధరాత్రి దుండగులు చోరీ చేశారు. ఇందులో ప్రొద్దుటూరు-2 టౌన్ ఎస్ఐ ధనుంజయ ఇల్లు కూడా ఉంది. ఎస్ఐ ఇంట్లో కొంత మేర నగదు పోయినట్లు తెలుస్తోంది. చోరీ జరిగిన ఇళ్లన్నీ పక్కపక్కనే ఉన్నాయి. ఈ చోరీ ఘటనపై గురువారం పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.