ప్రభుత్వంపై ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే విమర్శలు

రాజధాని పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆదివారం విమర్శించారు. భూములు ఇవ్వని రైతుల పొలాల్లోకి నీళ్లు వదిలారని, పొలంలో మట్టి తవ్వారని ఆయన ఆరోపించారు. సీఆర్డీఏ రైతుల పరిరక్షణ కమిటీ ఆహ్వానంతో అక్కడికి వెళ్లిన వైసీపీ నాయకులపై లోకేశ్ పంపిన అల్లరిమూకలు దాడి చేశాయని తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం, టీడీపీ వాళ్లను ధనవంతులు చేయడానికే ఈ పనులు చేస్తున్నారని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్