జమ్మలమడుగులో సోమవారం ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ, వైఎస్ స్టీల్ ఫ్యాక్టరీకి జగన్ కృషితోనే పునాది పడిందని, కొన్ని అడ్డంకులతో ఆగిపోయిన ఈ ప్రాజెక్టుకు జగన్ అధికారంలోకి వచ్చాక 3300 ఎకరాల భూమి కేటాయించారని తెలిపారు. ఉక్కు పరిశ్రమ కోసం జగన్ సజ్జన్ జిందాల్ను తీసుకొస్తే, ప్రస్తుత ప్రభుత్వం వారిపై కేసులు పెట్టిందని, ఇప్పుడు మళ్లీ శంకుస్థాపన అంటూ హడావిడి చేస్తున్నారని ఆయన విమర్శించారు.