వైఎస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరులో ఆర్ట్స్ కాలేజీ రోడ్డులోని వినాయక మండపం వద్ద విద్యుత్ షాక్కు గురై తీవ్రంగా గాయపడిన సందీప్ (16) అనే యువకుడిని మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ ఆదివారం పరామర్శించారు. సంఘటన సమాచారం తెలుసుకున్న కమిషనర్ వెంటనే హోలిస్టిక్ ఆసుపత్రికి చేరుకుని, ఐసీయూలో చికిత్స పొందుతున్న సందీప్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సందీప్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ప్రమాద ఘటనపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకుని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు.