ఆర్టీసీ బస్సు - బైక్ ఢీకొని ఒకరు మృతి

ఎర్రగుంట్లలోని జిల్లా పరిషత్తు బాలుర ఉన్నత పాఠశాల సమీపంలో సోమవారం ఆర్టీసీ బస్సు - బైక్ ఢీకొని నడుపుతున్న గోగుల వెంకటరమణ (51) మృతి చెందారు. బజ్జీల కోసం వెళ్లి తిరిగి వస్తుండగా కడప నుంచి తాడిపత్రికి వెళ్తున్న బస్సు ఎదురుగా వచ్చింది. వాహనం అదుపుచేయలేక దాన్ని ఢీకొన్నారు. ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕