దృష్టిలోపం ఉన్న వారు తప్పనిసరిగా కంటి అద్దాలు వాడాలని ఆప్తాల్మిక్ అధికారి కేజే రఘురామిరెడ్డి, డాక్టర్ శివప్రసాదరెడ్డి అన్నారు. ప్రొద్దుటూరు స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులకు 'స్కూల్ ఐ స్క్రీనింగ్ ప్రోగ్రాం' లో భాగంగా గురువారం ఆప్తాల్మిక్ అధికారి రఘురామిరెడ్డి కంటి పరీక్షలు నిర్వహించారు. శివప్రసాదరెడ్డి ప్రారంభించారు. హెల్త్ ఎడ్యుకేటర్ వెంకటేశ్వర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.