ప్రొద్దుటూరు హౌసింగ్ బోర్డ్ కాలనీలో మార్చి నెల 15వ తేదీన గోపిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇంటిలో సుమారు 249 గ్రాముల బంగారు ఆభరణాలను దొంగలు దొంగిలించారు. సదరు కేసులో ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీసులు గురువారం వీరి వద్ద నుండి సుమారు 180 గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేశామన్నారు. ఈ ఇద్దరు దొంగలైన జంగా వెంకట్రావు, సుధాకర్ లను ఇతర జిల్లా పోలీసు వారు అరెస్ట్ చేయగా ఈ కేసుకు సంబంధం ఉందన్న సమాచారంతో వారిని అరెస్టు చేశామని అన్నారు.