ప్రొద్దుటూరు - ఎర్రగుంట్ల బైపాస్ రోడ్డు లోని సినీ హబ్ ఎదుట గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు. బుధవారం స్థానికులు రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సుమారు 60 నుంచి 65 ఏళ్లలోపు ఉండవచ్చని బ్లూ గళ్ళ చొక్కా, పట్టెల లుంగీ ధరించి ఉన్నాడని తెలిపారు. ఎవరైనా గుర్తిస్తే రూరల్ సీఐ 9121100597లకు నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని అన్నారు.