ప్రొద్దుటూరు: లాడ్జీలో దారుణ హత్య

ప్రొద్దుటూరు సుందరాచార్యుల వీధిలోని ఓ లాడ్జీలో సోమవారం ఉదయం దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. తలపై బీరు సీసాతో కొట్టి హత్య చేసి ఉండొచ్చని లాడ్జీ సిబ్బంది చెబుతున్నారు. విషయం తెలుసుకున్న వన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. మృతునికి 30 ఏళ్లు ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్