వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని దొరసానిపల్లె పంచాయతీలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం ANM, ఆశా కార్యకర్తలు, అంగన్వాడి టీచర్ల సమక్షంలో జరిగింది. టీడీపీ ఇన్చార్జ్ మాడెం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.