కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మాజీ మునిసిపల్ ఛైర్మన్ వరప్రసాద్ డీఎస్పీ మురళీ నాయక్ కు వినతిపత్రం అందించారు. నానాజీ వ్యాఖ్యలు అవమానకరంగా, రాజకీయ మర్యాదలకు విరుద్ధంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, సంబంధిత వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వరప్రసాద్ డిమాండ్ చేశారు.