రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కులను చంద్రబాబు ప్రభుత్వం అణచివేస్తోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ విమర్శించారు. ప్రశ్నించడం, నిరసన తెలపడం డెమోక్రసీలో సాధారణమని శనివారం అన్నారు. కానీ, చంద్రబాబు పోలీసు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇటీవల వైసీపీ నేతలపై తీసుకున్న చర్యలే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై వైసీపీ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.