పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలోని వరదరాజుల రెడ్డి ఇంటి ఆవరణలో ఉన్న కొబ్బరి చెట్టుపై సోమవారం సాయంత్రం పిడుగు పడింది. పిడుగుపాటుకు కొబ్బరి చెట్టు నుంచి మంటలు చెలరేగాయి. నిప్పురవ్వలు సమీపంలోని అరటి పంటకు వ్యాపించడంతో గ్రామస్థులు అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. పిడుగుపాటుతో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని గ్రామస్థులు తెలిపారు.