కడప చెన్నై ప్రధాన రహదారిలోని నందలూరు బాహుద నది వంతెన సమీపంలో శుక్రవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు, స్కూటర్ ఢీకొన్న సంఘటనలో ప్రభుదాస్ అనే వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. రాజంపేట మండలం బోయినపల్లె ప్రాంతానికి చెందిన ప్రభుదాస్ నందలూరు లోని తమ బంధువుల వద్దకు వచ్చి తిరిగి రాజంపేటకు వెళుతున్న సమయంలో తిరుపతి నుండి కడప కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ సంఘటనలో తీవ్ర గాయాల పాలైన క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.