వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలోని జనసేన గ్యారేజ్ నందు జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అధ్యక్షులు భరత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జనసేన పులివెందుల మైనార్టీ నాయకుడు జనసేన బాబావల్లి మాట్లాడుతూ జన సైనికులు పవన్ కళ్యాణ్ కోరుకున్న స్థానంలోకి చేరాలని ఆకాంక్షించారు. ఆయన సేవ గుణం ప్రతి జనసైనికుడిలో ఉండాలని తెలిపారు.