జమ్మలమడుగు పట్టణంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విచ్చలవిడిగా ఫీజుల వసూళ్లకు పాల్పడుతున్నాయని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ప్రసాద్ సోమవారం ఆరోపించారు. ఆయన నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దాదాపు రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు ఫీజులు పెంచారని, దీంతో పాటు పుస్తకాలు, యూనిఫామ్ల పేరుతో తల్లిదండ్రులపై భారం మోపుతున్నారని తెలిపారు. విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ పాఠశాలలపై తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.