కడప జిల్లా పులివెందుల మండలం నల్గగొండువారిపల్లె గ్రామ ఘాట్ రోడ్డులో బుధవారం సాయంత్రం అరటికాయల లారీ బోల్తా పడింది. స్థానికుల కథనం మేరకు. నల్లగుండువారిపల్లె గ్రామ సమీపంలోనితోటల వద్ద నుంచి అరటికాయలను లోడ్ చేసుకునేందుకు పులివెందుల నుంచి వస్తుండగా బోల్తా పడినట్లు తెలిపారు. ప్రమాదంలో డ్రైవర్ కు, క్లీనర్ కు స్వల్ప గాయాలయ్యాయన్నారు. గాయపడిన వారు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.