పులివెందుల మెడికల్ కళాశాలను వెంటనే ప్రారంభించాలి

పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాల పూర్తి అయి సంవత్సరం దాటినా ప్రారంభించక పోవడం గర్హనీయమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి తులసి రెడ్డి అన్నారు. గురువారం ఆయన మెడికల్ కళాశాలను పరిశీలించారు. రూ. 670 కోట్లు ఖర్చు చేసి పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాలను సర్వాంగ సుందరంగా నిర్మించారన్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి నేషనల్ మెడికల్ కమీషన్ 50 యంబిబిఎస్ సీట్లు మంజూరు చేసిందన్నారు.

సంబంధిత పోస్ట్